Saturday, April 27, 2024

పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి దయాకర్‌రావు…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జనగామ ప్రతినిధి : అకాలవర్షాలు, ఈదురుగాలులు, రాళ్లవానతో జనగామ జిల్లాలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కాగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో పర్యటించి పంట నష్టాన్ని నేరుగా పరిశీలించారు.

రైతులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందిస్తామని భరోసా కల్పించారు. తొర్రూరు మండలం మడిపల్లి, చందూర్‌తండా, మాటేడు, పోలెపల్లి తదితర గ్రామాల్లో తీవ్రంగా మామిడితోటల పంట నష్టం వాటిల్లగా రైతులను కలిసి పరామర్శించారు. ఆయా గ్రామాల్లోని నిరాశ్రయులను కలిసి వారికి సహాయం చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. వడ్డేకొత్తపల్లి, పెద్దవంగర, చిన్నవంగర తదితర గ్రామాల్లో ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News