Friday, April 19, 2024

బతుకమ్మను ఎత్తుకొని మహిళలతో నడిచిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli distributed Bathukamma sarees

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రతి మండల కేంద్రంలో డప్పు చప్పుళ్ళు, సంప్రదాయ బతుకమ్మలు, మంగళ హారతులతో మహిళలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ర్యాలీగా సభా స్థలాలకు చేరుకున్నారు. ర్యాలీలో మంత్రి బతుకమ్మను తలపై ఎత్తుకొని మహిళలతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదలు పెట్టారన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కెసిఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి చీరలకు అందుతున్నాయి. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ – దారపు పోగుల అంచులతో చీరలు ఇస్తున్నమన్నారు. ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు అయిందన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు. చేతి నిండా పని లభించిందని మంత్రి తెలిపారు. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల కెసిఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం అమలు కావడం లేదు. పాలకుర్తి నియోజకవర్గంలో 3 కోట్ల 70 లక్షల విలువైన 1లక్షా 9 వేల 775 చీరలు పంపిణీ జరుగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

అలాగే నియోజకవర్గంలో మండలాల వారీగా…

పాలకుర్తి మండలంలో రూ.66.48 లక్షల విలువైన 20,145 చీరలు

దేవరుప్పుల మండలంలో రూ.54.48 లక్షల విలువైన 16,513 చీరలు

కొడకండ్ల మండలంలో రూ.40.60 లక్షలతో 12,327

పెద్ద వంగర మండలంలో రూ.37.85 లక్షల విలువైన 11,472 చీరలు

తొర్రూరు మండలంలో రూ.90.94 లక్షల విలువైన 27,559 చీరలు

రాయపర్తి మండలంలో రూ.71.80 లక్షల విలువైన 21.759 చీరలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News