Friday, April 26, 2024

క్రికెట్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

 

traffic restrictions

హైదరాబాద్: భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవసరం ఉంటే తప్ప బయటకు అడుగు వేయొద్దని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నుంచి ఆటగాళ్ళను భారీ బందోబస్తు మధ్య నగరంలోని స్టార్ హోటల్‌కు తరలించనున్నారు.

ఈ క్రమంలోనే రాచకొండ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించబోమని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ఎల్‌బినగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు మ్యాచ్‌ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసామని, గేట్ నెంబర్1 ద్వారా విఐపి, విఐపిల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 కార్లు పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News