Monday, May 6, 2024

గురుకుల కాలేజీలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి కోర్సుకు… రేపు స్పాట్ అడ్మీషన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని గిరిజన, సాంఘీక, బిసి సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ (5) పంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులో స్పాట్ కౌన్సిలింగ్ ఈ నెల 4న నిర్వహిస్తున్నామని ఎంజెపి బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డా. మల్లయ్య బట్టు తెలిపారు. కొత్తగా న్యాయ విద్య గురుకుల కాలేజీలు బాలికల కోసం హన్మకొండలో, బాలుర కోసం కందుకూరు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కాలేజీల్లో చేరేందుకు లాసెట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు (ర్యాంక్ కార్డు, 10వ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, టి సి, కుల , ఆదాయ ధృవీకరణ పత్రాలు) రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించారు. కౌన్సిలింగ్ హైదరాబాద్ ఎల్‌బి నగర్ చైతన్యపురిలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల (మహిళలు), సంగారెడ్డి లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల(పు), మహేశ్వరం, కందుకూరులోని ఎంజెపి బిసి గురుకుల న్యాయ కళాశాల (పురుషులు) హన్మకొండ, కాజీపేటలోని ఎంజెపి బిసి గురుకుల న్యాయ కళాశాల (స్త్రీలు), లలో కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు www.tswreis.ac.in/www.ttwrdcs.ac.in, /https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని మల్లయ్యబట్టు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News