Monday, May 6, 2024

రేపు జెఎన్‌జె హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశం

- Advertisement -
- Advertisement -

మంత్రులకు అబినంధన సభ : రమణారావు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ నెల 21న, గురువారం రవీంద్ర భారతిలో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల మాక్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశం జరుగుతుందని ఆ సొసైటీ ఫౌండర్ మెంబర్ పివి. రమణా రావు ఒక ప్రకటనలో తెలిసారు. ఈ సందర్భంగా మంత్రులకు అభినందన సభ కూడ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సమాచార, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ – సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జెఎన్‌జె మాక్స్ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత కమిటీ స్థానంలో కొత్త కమిటీ ఎన్నుకునే అంశంపై చర్చ జరగనున్నదని తెలిపారు. ఈ సమావేశానికి సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హైదరాబాద్ జర్నలిస్టులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలను జెఎన్‌జె మాక్స్ హౌసింగ్ సొసైటీకి స్వాధీనం చేయాలని స్రుపీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును అమలు చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి జర్నలిస్టులకు అన్యాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అమలు చేయాలని తాము చేపట్టిన పోరాటానికి అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సంపూర్ణ మద్ధతు ప్రకటించారని, సుధీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మా ఇంటి స్థలాల సమస్య పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలాలు స్వాధీనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, మంత్రి వర్గానికి కృతజ్ఞతగా అభినందన సభ ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో రమణరావు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News