Friday, April 26, 2024

అంత్యోదయకు బై ‘అదానీకి జై’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి ఆదానీకి ఆ స్తులు పెంచుతోందని విమర్శించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్ చర్చ సం దర్భంగా హరీశ్‌రావు బిజెపిని దుయ్యబట్టారు. గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఒక దశ దిశ ఉండేదని, ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఉండేదని పేర్కొన్నారు. దానికి తగినట్టు దేశ ప్రగతి కూడా ఉండేదన్నారు. కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో బడ్జెట్‌లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మోదీ మొదటి బడ్జెట్‌లో చెప్పిన థీమ్- సబ్ కా సాత్.. సబ్ కా వికాస్. కానీ ఆ ఏడాదం తా మాబ్ లించింగ్‌లు జరిగామని, రెండో బడ్జెట్‌లో నల్లధనాన్ని అరికడుతామని చెప్పారు..కానీ మరుసటి సంవత్సరమే పె ద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు.

ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని గుర్తు చే శారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయని మం త్రి తెలిపారు. నల్లధనం తెచ్చి, ప్రజల ఖా తాల్లో వేస్తామని మోడీ చెబితే.. ప్రజలు జన్‌ధన్ ఖాతాలు తెరిచి ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి కూడా ఒ క్క పైసా డిపాజిట్ కాలేదన్నారు. మూ డో బడ్జెట్‌లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్న ట్లు ప్రకటించారని… కానీ రైతులను ప ట్టించుకోకుండా, 2020లో మూడు వ్య వసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు.ఈ చట్టాలు 750 మం ది రైతులు ఉసురు పోసుకున్నారని గుర్తు చే శారు. ఇది అమృత్ కాల్ మోడీ ప్రభు త్వం గొప్పలు చెప్పుకుంటుందని, వాస్త వానికి ఇది దేశానికే ఆపద కాలంగా మా రిందని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బిఎం విషయంలో కేంద్రం ఏకపక్షంగా కోతలు విధిస్తున్నందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కో నీతి, తె లంగాణకు మరో నీతి అన్నట్లుగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నదని మండి పడ్డారు.

అంటూ ఈ దేశ ప్రజలను మోడీ ప్ర భుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. సంవత్సరానికి 2 కోట్ల ఉ ద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. అర్హులైన వారందరికి ఇండ్లు అని ప్రకటించారు.. అది అడ్రస్ లేదని విమర్శించారు. రైతుల ఆదా యం రెట్టింపు చేయలేదని, నదుల అనుసంధానం కాలేదని అన్నారు. కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం సాధించిన విజయా లు కూడా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చే శా రు. జిడిపిని మంటగలపడంలో బిజెపి స క్సెస్ అయిందని, ఫుడ్ సెక్యూరిటీని నాశ నం చేయడం లో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చే యడంలో, సెస్సుల రూపం లో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్‌టి విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఇడి, సిబిఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో సక్సెస్ అయ్యిందని, రొటేషన్‌లో వచ్చే జి20 ప్రెసిడెంట్‌షిప్‌ను తమ ఘనతగా చెప్పుకోవడంలో -సక్సెస్ అయ్యిందని ఎద్దేవా చేశారు. మతపిచ్చి మంటలు రేపడంలో డబుల్ సక్సెస్ అయ్యిందని హరీశ్‌రావు చురకలంటించారు.

బిజెపి సర్కారుది అంతా ధోకా…

కేంద్రం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానిది అంతా ఢోకా అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు- ధోఖా…అర్హులైన వారందరికీ ఇండ్లు- ధోఖా..రైతుల ఆదాయం రెట్టింపు ధోఖా…పటిష్టమైన లోక్ పాల్ బిల్లు – ధోఖా…నదుల అనుసంధానం – ధోఖా అంటూ హరీశ్‌రావు మాట్లాడుతుండగా, సభ్యులు బల్లలు చరుస్తూ ధోకా…ధోకా…సక్సెస్…సక్సెస్ అంటూ మంత్రి ఆరోపణలకు తమ మద్దతు తెలిపారు.

మతం పేరుతో రాజకీయాలు చేయలేదు

రాజకీయాల్లోకి దుష్ట సంప్రదాయాలు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు కెసిఆర్‌ది తాంత్రిక పాలన అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ఫామ్ హౌజ్‌లో తాంత్రిక పూజలు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు చేయరని, కపిల గోవుకు పూజలు చేస్తారని తెలిపారు.గోవుకు పూజలు తాంత్రిక పూజలు అని దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం బనారస్ యూనివర్సిటీలో చేతబడి కోర్సులు పెట్టినట్లు తాము పెట్టలేదని విమర్శించారు. ఏ పని ప్రారంభించినా ముఖ్యమంత్రి కెసిఆర్ దేవుడికి మొక్కుకుంటారని వెల్లడించారు. సిఎం కెసిఆర్ ఆధ్యాత్మిక గుణ సంపన్నుడని వ్యాఖ్యానించారు. కానీ ఎప్పుడూ కెసిఆర్ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, ప్రాజెక్టులు, బ్యారేజీలకు దేవుళ్ల పేరు పెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని పేర్కొన్నారు. యాదాద్రిని భూలోక వైకుంఠంగా కట్టించారని తెలిపారు. దేవుడి పేరుతో ఏం చేసినా ఓట్ల కోసం చేయలేదని చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రజల కోణంలో మాట్లాడటానికి ఏమి లేక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం

ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని సిఎం కెసిఆర్ ఎప్పుడో చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు.ఆరోగ్య శ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు తీవ్రమైన జబ్బులకు ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అద్భుత లక్ష్యాలను సాధించిందని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మాతృ మరణాలను(ఎంఎంఆర్) 43కు తగ్గాయని అన్నారు. మాతృ మరణాల తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి పెట్టిన లక్ష్యం 70 అని, కానీ తెలంగాణలో 43కు తగ్గించామని తెలిపారు. కెసిఆర్ కిట్ వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 63 శాతానికి పెరిగాయని చెప్పారు. అలాగే 99.9 శాతం ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటిచిందని గుర్తు చేశారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించడానికి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు.

ఈ పథకం 9 జిల్లాల్లో ప్రారంభం కాగా, ఈ ఏడాది నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 4 లక్షల మంది గర్భిణీ మహిళలు లబ్ది పొందుతారని చెప్పారు. వైద్యవిద్యలో లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామన్నారు. వరంగల్‌లో అతిపెద్ద కార్పొరేట్ ఆస్పత్రి దసరా నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను 3 నుంచి 104కు పెంచామని చెప్పారు. ఇవేవి కాంగ్రెస్, బిజెపి నాయకులకు కనపడదు… వినపడదని ఎద్దేవా చేశారు. కంటి వెలుగు కార్యక్రమం కింద ప్రభుత్వమే ప్రజల దగ్గకు వెళ్లి కంటి పరీక్షలు చేస్తోందని పేర్కొన్నారు. విపక్ష నాయకులు కూడా కంటి వెలుగు పరీక్షలు చేసుకోవాల… అప్పుడైనా వారికి అభివృద్ధి కనపడుతుందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

కార్పోరేట్‌కు ధీటుగా గురుకులాలు

రాష్ట్రంలో 988 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ప్రారంభించి, పేద విద్యార్థులకు కార్పోరేట్ ధీటుగా నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.కాంగ్రెస్ హయాంలోనే శ్రీచైతన్య, నారాయణ వంటి విద్యాసంస్థలు వచ్చాయని విమర్శించారు. గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్, డిగ్రీ, పిజి, న్యాయ విద్య కోర్సులు అందిస్తున్నామని చెప్పారు. గురుకుల విద్యార్థులు నీట్, జెఇఇ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు పొందుతున్నారని తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మీది పెదవులతో పనిచేస్తే…మేము హృదయంతో పనిచేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్ష నేతలకు చురకలంటించారు.

మన్ కీ బాద్ కాదు…జన్ కి బాత్ విను : ఈటలపై హరీశ్‌రావు సెటైర్

సీటు మారినంత మాత్రాన మనిషి మారొద్దని మంత్రి హరీశ్‌రావు ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి అన్నారు. దళితబంధు ఎన్నికల పథకం అని చెప్పారని, ఎన్నికల తర్వాత అమలు జరగదని, ఈ పథకం కింద ఇచ్చిన డబ్బలు తిరిగి తీసుకుంటారని ప్రచారం చేశారని గుర్తు చేశారు. ధళితబంధు పథకం ఎన్నికల కోసం వచ్చిన పథకం కాదని, సిఎం కెసిఆర్ హృదయం నుంచి పుట్టిందని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ కాదు…జన్ కీ బాత్ వినాలని ఈటల రాజేందర్‌కు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News