Thursday, September 18, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా: మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తానని కెటిఆర్‌కు మంత్రి పొంగలేటి సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్‌పై మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి కెటిఆర్ ఆలోచించాలని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. మూడున్నర సంవత్సరాల తర్వాత కెటిఆర్ ఇండియాలో ఉంటావా? లేదా ఫారిన్‌లో ఉంటావా? అంటూ మంత్రి పొంగులేటి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయో స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అన్నే సీట్లు వస్తాయని పొంగులేటి ఎద్దేవా చేశారు. గురువారం మంత్రి పొంగులేటి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News