Wednesday, December 6, 2023

విద్యార్థులకు లిఫ్టు ఇచ్చిన విద్యాశాఖ మంత్రి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యాశాఖ మంత్రే తన కారులో లిఫ్టు ఇవ్వడంతో చిన్నారి విద్యార్థులు సంబరపడిపోయారు. బుధవారం మహేశ్వరం మండలం గొల్లరు నుంచి పెద్ద గోల్కొండ ఒఆర్‌ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాలినడకన ఇంటికి వెళుతున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా..? అని అడగ్గా…వారే సరే అన్నారు. గొల్లురు నుండి తండా వరకు కారులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి సబిత విద్యార్థులకు ముచ్చటించారు. ఏం చదువుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకొని బాగా చదివి,ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రోత్సహించారు. విద్యార్థులను కారులోనే ఇంటి వద్ద డ్రాప్ చేసి, వారి తల్లిదండ్రులతో మంత్రి మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News