Monday, April 29, 2024

హరీశ్ రావు ప్రశ్నల వర్షం… కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బిఆర్ఎస్ హయంలో ఈ పథకం నిబంధనలను ఇష్టానుసారంగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పడు పెద్ద ఫౌంహౌస్ ల ఓనర్లు, మంత్రులు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. ఇది రైతు ప్రభుత్వం అన్న సీతక్క అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు రైతుబంధు ఇస్తారో చెప్పాలని రైతుల పక్షాన తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News