Saturday, July 27, 2024

గోలి శ్యామలను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామల ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ముర్షిదాబాద్‌లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో సెప్టెంబర్ 3న భగీరథ నదీ లో జరిగిన 81 కిలో మీటర్ల స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించేందుకు రాష్ట్రంలో క్రీడా మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 17, 800 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామని, క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్యా లో 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

గతంలో గోలి శ్యామల శ్రీలంక లోని తలైమనార్ నుండి ధనుష్ కోటి (తమిళ నాడు) వరకు, అమెరికా లోని కేటాలీన ఛానల్ నుండి లాస్ వెగాస్ వరకూ జరిగిన స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లలో పాల్గోని తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ( శాట్స్ ) ద్వారా గోలి శ్యామలకి ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెటరన్ క్రీడాకారులు మర్రి లక్ష్మారెడ్డి, టిజిఓ నాయకులు జగన్మోహన్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News