Friday, April 19, 2024

యుపిలో బిజెపికి షాక్.. మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

- Advertisement -
- Advertisement -

Minister Swami Prasad maurya resign in UP

లక్నో: అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ క్యాబినేట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, మరో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, భగవతి సాగర్, ప్రజాపతిలు మంగళవారం రాజీనామా చేశారు. మొదట తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మౌర్య ప్రకటించారు. అంతేకాదు, బిజెపి పార్టీ సభ్యత్యానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ట్వీటర్ లో పోస్ట్ చేసిన మౌర్య.. సమాజ్ వాది పార్టీలో చేరనున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. యుపిలో ప్రజలకు అనుకూలంగా పాలన జరగడం లేదని.. దళితులు, యువకులు, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు. మౌర్య రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, మౌర్య రాజీనామాపై స్పందించిన డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషమని, రాజీనామాకు కారణాలు తనకు తెలియవన్నారు. కానీ, స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Minister Swami Prasad maurya resign in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News