Friday, April 26, 2024

అమీర్‌పేట్ ప్రభుత్వ పాఠశాల దత్తత

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతా : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా కార్పోరేట్ విద్యాసంస్థల కు దీటుగా విద్యాబోధనకు శ్రీకారం చుట్టామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్ధులకు అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో షూస్స్‌లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనవివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ పాఠశాలను దత్తత తీసుకుంటున్నాని, రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చి దిద్దుతానని ప్రకటించారు.

ఆహ్లాదకరమైనవాతావరణంలో విద్యార్ధులకు విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన బస్తీ, మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.7200 కోట్లను కేటాయించారని పేర్కొన్నారు. మొదటి విడతలో 33 శాతం పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా అమీర్ పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.90 లక్షల ను విడుదల చేశామని తెలిపారు.

వీటితో పాఠశాల భవనం మరమ్మతులు, పెయింటింగ్, టాయిలెట్స్ నిర్మాణం, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించడం, ఫర్నిచర్ ను కొనుగోలు తదితరఅభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా విద్యార్ధులకు అవసరమైన క్రీడా సామాగ్రి, సాంస్కృతిక ప్రదర్శనలకు కావలసిన పరికరాలు, దుస్తులు వంటివి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని 15 రోజులలో అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు.

పభుత్వ పాఠశాలల అభివృద్దికి, విద్యార్ధులు తమ విద్యను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించే విధంగా చేయూతను అందిస్తున్న అగర్వాల్ సమాజ్ నిర్వహకులను ఈ సందర్బంగా మంత్రిఅభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం ఉన్న టీచర్స్ ఉన్నారని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను అందిస్తున్నదని మంత్రి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముందుగా కనకదుర్గమ్మ దేవాలయంలో అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిపైడ్ వాటర్ కూలర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధు, అగర్వాల్ సమాజ్, అధ్యక్షులు రితేష్ జగ్ నాని, రాజ్ కుమార్ అగర్వాల్ డిప్యూటీ డిఇఓయాదయ్య, సంజయ్, అనూప్ కేడియా, దినేష్ అగర్వాల్ , కునాల్ అగర్వాల్ , అంజనా జగ్ నాని, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, గులాబ్ సింగ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News