Saturday, April 20, 2024

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

మెండోరా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో నీటి ప్రాజెక్టులు అన్ని అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోరా మండలం పోచంపాడ్‌లో పోచంపాడ్, సోన్‌పేట్ గ్రామాల మధ్య నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ఏర్పడక ముందు శివాలయాలుగా ఉన్న ప్రాజెక్టులు ప్రస్తుతం వైష్ణవాలయాలుగా మారుతున్నాయన్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలోని ప్రాజెక్టులు అభివృద్ధి చెందడమే అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ప్రాజెక్టుకు పూర్వకులను తీసుకువచ్చిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. కాకతీయ కాలువ వంతెనపై దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త టెక్నాలజితో వంతెన నిర్మిస్తున్నామన్నారు. 1.38 కోట్ల నిధులను సిఎం కెసిఆర్ స్వయంగా మంజూరు చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు నిండుకుండలా ఉంటున్నాయన్నారు. కాకతీయ కాలువ ద్వారా నిరంతరం నీటి విడుదల చేపట్టడం వలన కాలువపై వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదన్నారు. ప్రస్తుతం నీరు ప్రవహించిన ఇబ్బంది లేకుండా కొత్త టెక్నాలజీతో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రెండు గ్రామాల మధ్య కాకతీయ కాలువపై రవాణా ఇబ్బంది లేకుండా పోతుందన్నారు. అనంతరం ప్రాజెక్టు పై అండర్ గ్రౌండ్‌కు వెళ్లడానికి 25 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ మార్గాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News