Thursday, September 18, 2025

అఫ్జల్‌సాగర్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

వర్షాలు సృష్టించిన బీభత్స పరిస్థితి కారణంగా వీధుల్లో వరద ప్రవాహం తీవ్రతకు మాంగార్‌బస్తీలో నాలుగు రోజుల క్రితం ఇంటి ఎదుట మంచం తీస్తున్న క్రమంలో మామ, అల్లుడు రామ్, ఆర్జున్‌లు కాలు జారి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు గల్లంతైన సంఘటన విధితమే. గురువారం అల్లుడు అర్జున్ మృతదేహం హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరాన ఉన్న యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం కాలువలో మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని చూసిన స్థానికులు వలిగొండ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు హబీబ్‌నగర్ పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి శవ పరీక్ష నిమిత్తం పంపించారు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మృతుడి నివాసం మాంగార్‌బస్తీకి తరలించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.

మామ రామ్ ఆచూకీ నేటి వరకు తెలియరాలేదు. ఈ మేరకు నీటి ప్రవాహంలో గల్లంతైన రామ్ ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఎనిమిది బృందాలు రంగంలోకి దిగి గాలింపు తీవ్రం చేశారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొట్టుకుపోయిన రామ్ ఆచూకీ కోసం పోలీసులు, డీఆర్‌ఎఫ్, హైద్రా బృందాలు మూసీ నది పొడవునా గాలిస్తున్నారు. గతంలో ఇద్దరు ఇదే తరహాలో నాలా ఉధృతంగా ప్రవహిస్తున్న వేళలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. ఓ బాలిక శవం నేటికి ఆచూకి తెలియరాలేదు. అర్జున్ మృతదేహాన్ని లభ్యం కావడాన్ని వలిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. శవ పరీక్షల అనంతరం ఈకేసును తమకు హబీబ్‌నగర్ పోలీసులకు బదిలీ చేస్తారని పోలీస్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం రావు తెలిపారు. అర్జున్ మృతదేహం లభ్యం కావడంతో వారి బస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారి రోదనలు మిన్నంటాయి. తమ తండ్రి మృతదేహం దొరకడంతో చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: శబరిమలలో బంగారం మాయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News