Tuesday, September 10, 2024

షాబాద్ లో యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

యువతి అదృశ్యమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన మారుగల్ల మల్లేష్ చిన్న కూతురు మారుగల్ల అక్షయ (18) అదృశ్యమైంది. ఈ నెల 6న రాత్రి 10గంటల సమయంలో ఇంట్లో అందూరు భోజనం చేసి పడుకున్నారు. అర్థరాత్రి 2గంటల సమయంలో నిద్ర లేచ్చి చూడగానే తన చిన్న కూతురు అక్షయ కనిపించలేదు. వాష్‌రూంలోకి వెళ్లిందని అనుకున్నాడు.

చాలా సేపటి వరకు కూడా కూతురు కనిపించకపోవడంతో బయటకు వెళ్లి చూడగా ఎక్కడ కనిపించలేదు. చుట్టు పక్కల వెతికిన యువతి ఆచూకీ లభించలేదు. నానాజీపురం గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు తన కూతురిని తీసుకొని వెళ్లి ఉంటాడని అనుమానం ఉందని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి ఇంట్లో నుంచి వెళ్లిన సమయంలో గ్రీన్ కలర్ పాయింట్, రెడ్ కలర్ టీషట్ ధరించి ఉందని తెలిపారు. షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News