Tuesday, September 10, 2024

శ్రీలంకకు సిరీస్

- Advertisement -
- Advertisement -

భారత్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య శ్రీలంక టీమ్ 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 20తో సొంతం చేసుకుంది. తొలి వన్డే టైగా ముగియగా, తర్వాత రెండు మ్యాచుల్లో లంక జయకేతనం ఎగుర వేసింది. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా, అవిష్క ఫెర్నాండో జట్టుకు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిసాంకా ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.

ఫెర్నాండో 102 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుసాల్ మెండిస్ (59) పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 26.1 ఓవర్లలో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (35), కోహ్లి (20), సుందర్ (30), పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగె ఐదు, తీక్షణ, జెఫ్రి రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News