Saturday, April 27, 2024

ఎంఎల్ఎ రాజా సింగ్ హౌస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

చెంగిచెర్ల అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు.

హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా, మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గాయపడిన వారిని పరామర్శించేందుకు బిజేపి నాయకులు వెళ్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News