Saturday, April 27, 2024

కాంగ్రెస్ ఎంఎల్ఎపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఎవరైనా ఓట్లు చీలిక తెచ్చేలా మాట్లాడితే “వారి చేతులు నరికివేయండి… వారిని విడిచిపెట్టవద్దు ” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వీర్‌సింగ్ భూరియాపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ లోని తాండ్లా నియోజకవర్గం ఎంఎల్‌ఎ అయిన వీర్‌సింగ్ భూరియా మంగళవారం రత్లాంఝాబుయా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అనితా చౌహాన్ పోటీ చేస్తున్నారు. ఆమెను లక్షంగా చేసుకుని వీర్‌సింగ్ భూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఝాబువా జిల్లాలో ఓట్లు చీలిక తెచ్చేలా ఎవరైనా మాట్లాడితే “వారి చేతులు నరికి వేయండి, వారిని విడిచిపెట్టవద్దు, వారితో అలాగే ప్రవర్తించండి. అప్పుడే వారు మిమ్మల్ని గుర్తిస్తారు” అని భూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీజేపీ అభ్యర్థికి చెందిన భిలాలా సమాజంపై కూడా కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. భిలాలా వర్గాన్ని దొంగలు, దోపిడీ దారులుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వీడియో లో వైరల్ కావడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మేఘ్‌నగర్ తహశీల్దార్ బిజేంద్ర కటరే ఫిర్యాదుపై భూరియా పై కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News