Friday, April 19, 2024

ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగుతుంది. కవిత ఇంటికి సిబిఐ అధికారులు రాకపై సస్పెన్స్ విధించారు. ప్రస్తుతం తన నివాసంలోనే ఉన్న కవిత ఉదయం 11 గంటల వరకు వేచిచూడనున్నారు. సిబిఐ అధికారులు తన నివాసానికి వస్తే, వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఆమె జగిత్యాలకు వెళ్లనున్నారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని  గతంలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సిబిఐ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన ఎఫ్‌ఐఆర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దాంతో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని ఆమె పేర్కొన్నారు.  అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఇడి వెల్లడించిన విషయం విధితమే.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News