Tuesday, October 15, 2024

తల్లి పేరిట మొక్క… యుపిలో 26 కోట్లు, గుజరాత్ లో 15 కోట్ల మొక్కలు నాటాం: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నీటి సంరక్షణ ఎంత ముఖ్యమో వర్షకాలం సూచిస్తుందని, నీటి నిర్వహణ చాలా కీలకమని, నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీచ్‌ల వద్ద శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మహాత్మాగాంధీకి నివాళిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రధాని మోడీ మన్‌కీ భాత్ 114వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. పదేళ్ల క్రితం అక్టోబర్ 3న మన్‌కీ బాత్ ప్రారంభమైందని మోడీ గుర్తు చేశారు. మన్ కీ భాత్ లో స్ఫూర్తిదాయక కథనాలు, సానుకూల అంశాలు ప్రజలను ఆకర్షించాయని వివరించారు. 20 వేల భాషలకు భారత్ పుట్టినిల్లు అని, దేశంలోని భాషల పరిరక్షణకు చర్యలు తీసుకుందామని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘తల్లి పేరిట మొక్క’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, ఉత్తర ప్రదేశ్‌లో తల్లి పేరిట మొక్క కింద 26 కోట్ల మొక్కలు నాటామని, గుజరాత్‌లో 15 కోట్లకు పైగా మొక్కలు నాటామని మోడీ తెలియజేశారు. మొక్కలు నాటి వాతావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని మోడీ పిలుపునిచ్చారు. నూతన ఉత్పత్తుల తయారీదారులు క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పండుగల సందర్భంగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను భారతీయులు కొనుగోలు చేయాలన్నారు. ప్రతి రంగంలో ఎగుమతులు పెరిగాయని, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో ప్రభుత్వం ఎంతో పురోగతి సాధించిందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News