Saturday, April 27, 2024

జియో 500 కోట్ల డాలర్ల బాండ్ ఇష్యూ

- Advertisement -
- Advertisement -

Moody’s rates Reliance’s $5-billion bond issue

రిలయన్స్‌కు బిఎఎ2 రేటింగ్ ఇచ్చిన మూడీస్

న్యూఢిల్లీ : ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ బాండ్ల ద్వారా 500 కోట్ల డాలర్లను సమీకరించేందుకు బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. దీని ద్వారా కంపెనీ తన ఆర్థిక బాధ్యతను తగ్గించుకోవాలనుకుంటోంది. ఈ ప్రతిపాదిత బాండ్లకు రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ నిలకడ దృక్పథంతో బిఎఎ2 రేటింగ్‌ను ఇచ్చింది. జియో చివరిసారిగా 2018 జూలైలో స్థానిక కరెన్సీ బాండ్ మార్కెట్‌కు వచ్చింది. అయితే రిలయన్స్ జియో 5జి నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాండ్ వార్త వినిపించింది.

మూడీస్ విశ్లేషకుడు శ్వేతా పటోడియా మాట్లాడుతూ, ఆర్‌ఐఎల్‌కు బిఎఎ2 రేటింగ్ కంపెనీ పరిమాణం, విభిన్న వ్యాపారాలలో కీలకమైన మార్కెట్ స్థితిని ప్రతిబింబిస్తోందని అన్నారు. గత శనివారం ఆర్‌ఐఎల్ బోర్డు ఫైనాన్స్ కమిటీ సమావేశంలో అన్‌సెక్యూర్డ్ యుఎస్ డాలర్ ఫిక్స్‌డ్ రేట్ లెటర్‌లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రెగ్యులర్ వ్యవధిలో మొత్తం 5 బిలియన్లతో జారీ చేసే ప్రతిపాదనను ఆమోదించింది. వీటి జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో 2016లో టెలికాం పరిశ్రమలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కంపెనీ ఉచిత కాలింగ్, డేటా ద్వారా టెలికాం పరిశ్రమలో ధరల యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ మాత్రమే రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News