Friday, March 29, 2024

కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

- Advertisement -
- Advertisement -

 

Telangana Report 1052 Corona Cases in 24 hrs

కోవిడ్ -19తో మృతిచెందితే రూ. 50 వేల ఎక్స్-గ్రేషియా
ఈ పరిహారం కావాలనుకుంటే మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కోవిడ్-19తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ఎక్స్-గ్రేషియా పొందేందుకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ తెలియచేసింది. కోవిడ్-19తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4,500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచి మీ సేద కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారు. కోవిడ్ 19 డెత్ నిర్ధారణ కమిటీ కోవిడ్-19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని, దీని అనంతరం ఎక్స్-గ్రేషియా మరణించిన వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 040-48560012 లేదా meesevasupport@telangana.gov.in అనే మెయిల్‌లో సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

TS Govt announces Rs 50k ex-gratia for covid deaths

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News