Sunday, April 28, 2024

మెసేజింగ్ యాప్ నుంచే మాస్కో దాడి కుట్ర అమలు

- Advertisement -
- Advertisement -

మాస్కో: మాస్కో లోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో దాడికి పాల్పడిన ముష్కరులను కేవలం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచే నడిపించినట్టు గుర్తించారు. నిందితుల విచారణలో తమకు డబ్బులు, ఆయుధాలు ఎవరు ఇచ్చారో తెలియదని వారు చెబుతున్నారు. ఈ దృశ్యాలను జాతీయ టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. నలుగురు నిందితులు వారు వాడిన కారును చూపాయి. వీరిని బ్రియాన్స్ పశ్చిమ ప్రాంతంలో ఖట్సన్ అనే గ్రామం వద్ద రష్యా ప్రత్యే దళాలు అరెస్ట్ చేశాయి. రాత్రివేళ చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో దళాలు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుండగా, రష్యా యాసలో అతడు మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. వీరంతా తజికిస్థాన్‌కు చెందిన వారని రష్యా ఎంపీ ఒకరు పేర్కొన్నారు. డబ్బులు కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని నిందితుడు స్పష్టంగా చెబుతున్నట్టు కనిపిస్తోంది.

కొందరు 5 లక్షల రూబుళ్లను ఆఫర్ చేసినట్టు పేర్కొన్నాడు. ఈ మొత్తంలో సగం మొత్తం ఇప్పటికే స్వీకరించి ఓ బ్యాంక్ ఖాతాలో వేసినట్టు గుర్తించారు. దాడి అనంతరం ఆయుధాలను రోడ్డు పక్కన పారేసినట్టు మరో దుండగుడు తెలిపాడు. ఇక నిందితులపై దళాలు దాడి చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తమ దళాలు ఎఫ్‌ఎస్‌బీతో కలిసి నిందితులను అరెస్ట్ చేసినట్టు చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ పేర్కొన్నాడు. మాస్కోపై దాడిలో ఇప్పటివరకు దాదాపు 133 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపు లోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News