Sunday, April 28, 2024

పిల్లలను చూసి నేర్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

MP Santoshkumar

 

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం సామాజిక దూరం పాటించడంలో కొంతమంది పెద్దల కంటే పిల్లలు ముందు వరుసలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో అభినందించారు. పిల్లలు కిరాణషాపు దగ్గర సామాజిక దూరం పాటిస్తున్న ఫోటోను ఆయన పోస్టు చేశారు. ఈ ఫోటో సామాజిక దూరం పాటించని పెద్దలను ఆలోచింప చేస్తోంది. కరోనా నియంత్రణ కోసం ట్విట్టర్ వేదికగా ఎంపి సంతోష్‌కుమార్ ప్రజలను చైతన్యం చేస్తున్న ప్రయత్నంలో పోస్టు చేసిన ఈ ఫోటో ఆలోచనాత్మకంగా ఉంది. కరోనా నియంత్రణకు ఉన్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమే. అయితే సామాజిక దూరం పాటించి కరోనాను తరిమివేయాలనే లక్ష్యాన్ని ఛేదించడంలో కొంతమంది విఫలమవుతున్నారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికి కొందరు వినిపించుకోవడం లేదు. కానీ సామాజిక దూరాన్ని పిల్లలు ఖచ్చితంగా పాటిస్తున్నారు.

అది కూడా కిరాణషాపు దగ్గర. పిల్లలు కిరాణ షాపు దగ్గర ఒకరిమీద ఒకరు ఎగబడి చిరుతిళ్లను కొనడం చూశాం. అయితే ఈ కిరాణ షాపు దగ్గర గీసిన గళ్లలో క్రమశిక్షణగా నిలబడి, సామాజిక దూరం పాటిస్తూ పిల్లలు చిరుతిళ్లను కొనుక్కుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పోస్టు చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఎందరినో ఆలోచింప చేస్తోంది. ఈ పిల్లలు ఖచ్చితమైన సామాజిక దూరం పాటిస్తున్నారని సంతోష్ కుమార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పిల్లలు పాటిస్తున్న సామాజిక దూరం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. అయితే ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని ఆయన గుర్తు చేశారు. తప్పని సరిపరిస్థితుల్లో బయటకు రావల్సివస్తే తప్పనిసరిగా మాస్క్‌లు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఎంపి సంతోష్‌కుమార్ ప్రజలను కోరారు.

సామాజికదూరం పాటించడం తప్పనిసరి
బిక్షాటన చేస్తున్న వారు కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు అనడానికి కేరళ రాష్ట్రంలోని కొయిలాండ్ మున్సిపాలిటీలోని పెరంబ్రలో జరిగిన సంఘటన నిదర్శనం. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఎంపి సంతోష్‌కుమార్ పోస్టు చేయగా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. వీడియో వివరల్లోకి వెళ్లితే లాక్‌డౌన్ నేపథ్యంలో బిక్షాటన చేసి జీవించే ఓ వ్యక్తి గత మూడు రోజులుగా పస్తులతో ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది.

ఈ మేరకు పోలీసులు ఆ వ్యక్తికి భోజనం, మంచి నీటి బాటిల్ తీసుకువెళ్లగా అతను పోలీసులను దగ్గరకు రానివ్వలేదు. దూరంగా భోజనం పెడితేనే తీసుకుంటానని చ్పెపారు. పోలీసులు ఆమేరకు భోజనం సమకూర్చడంతో ఆవ్యక్తి తీసుకున్నాడు. కరోనా నేపథ్యంలో చదువుతో సంబంధంలేని ఆవ్యక్తి వివేకం, విజ్ఞానంతో సామాజిక దూరం పాటించడం పట్ల సంతోష్ కుమార్ అభినందిస్తూ ట్విట్టర్‌లో చేసిన పోస్టు ఆలోచనాత్మకంగా ఉంది. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాజిక దూరానికి ఉన్న ప్రాధాన్యతకు ఇదో తార్కాణమంటూ సంతోష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పిల్లలదే ఈ ప్రపంచం
ప్రస్తుత ప్రపంచం పిల్లలదే అంటూ ఎంపి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో ప్రశంసించా రు.టిక్‌టాక్ వీడియోలో ఒక చిన్నారి కనబర్చిన హావభావాలను అభినందిస్తూ ఆ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పిల్లలకు లాక్‌డౌన్ నేపథ్యంలో స్కూల్ లు, పరీక్షలు లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేసూ ఓ చిన్నారి చేసిన టిక్‌టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

MP Santoshkumar praised children
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News