Wednesday, April 30, 2025

రాయుడు ఆరోపణల్లో నిజం లేదు: ఎమ్మెస్కే

- Advertisement -
- Advertisement -

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. రాయుడు తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నాడు. తాను ఎప్పుడూ కూడా రాయుడుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదన్నాడు. అలాంటి అవసరం కూడా తనకు లేదన్నాడు.

ఇక జట్టు ఎంపికలో చీఫ్ సెలెక్టర్ ఒక్కడి ప్రమేయం ఉండదన్నాడు. మిగతా సభ్యులు కూడా సమష్టిగా నిర్ణయం తీసుకుంటారన్నాడు. కాగా, రాయుడు ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెస్కే, శివలాల్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News