Saturday, April 27, 2024

7 ఎల్‌ఇపి ఘటన అత్యంత హృదయవిదారకం

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణిలోనే అతి పెద్ద ప్రమాదంగా నమోదు కాబడిన 7 ఎల్‌ఇపి ఘటన అత్యంత హృదయవిదారకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 20 సంవత్సరాల క్రితం గనిలో వరద ప్రవాహంలో 17 మంది మృత్యువాతపడగా మృతులకు శుక్రవారం గని ఆవరణలోని స్థూపం వద్ద ఎమ్మెల్యేతో పాటు సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థూపానికి ఎమ్మెల్యే పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ సింగ రేణి కార్మికుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అప్పటి సిఎం చంద్రబాబునాయుడుతో ఎక్స్‌గ్రేషియా విషయంలో పోరాడినట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో గుర్తింపు సంఘం టిబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, దేవ వెంకటేశ్, ఇనుముల సత్యం, ప్యారేమియా, నారాయణదాసు మారుతి, తేడేటి శంకర్‌గౌడ్, పర్లపల్లి రవి, దొమ్మెటి వాసు, దాసరి శ్రీనివాస్, జడ్సన్ తదితరులు పాల్గోన్నారు.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో …
మరో కార్యక్రమం సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. నాయకులు మృతులకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఐఎన్‌టియుసి సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, సిఐటియు ఉల్లి మొగిలి మాట్లాడుతూ రెండు దశాబ్దాలు గడిచిన బాధిత కుటుంబాల గాధలు తీరడం లేదన్నారు. సింగరేణిలో ఇంకా ప్రమాదాల పరంపర కొనసాగుతుందన్నారు. ఇన్ని ప్రమాదాలు జరిగినా ఏ ఒక్క అధికారిపై చర్యలు తీ సుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రమాదాలకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News