Wednesday, May 7, 2025

ముంబయిపై గెలిచిన గుజరాత్

- Advertisement -
- Advertisement -

వాంఖడే: ఐపిఎల్‌లో భాగంగా ముంబయిపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ డిఎల్‌ఎస్ పద్ధతిలో మూడు వికెట్ల తేడా గెలుపొందింది. ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. వర్షం పడడంతో ముంబయి లక్ష్యాన్ని 147 పరుగులకు కుదించారు. గుజరాత్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 43 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో జిటి తొలి స్థానంలో ఉంది. 14 పాయింట్లతో ముంబయి నాలుగో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో బెంగళూరు, మూడో స్థానంలో పంజాబ్‌లు నిలిచాయి. ఐదో స్థానంలో ఢిల్లీ జట్లు ఉన్నాయి. ఈ ఐదు జట్లకు ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News