Thursday, October 10, 2024

నా ఫేవరెట్ కెప్టెన్ రోహిత్ శర్మనే: యువీ

- Advertisement -
- Advertisement -

తన ఫేవరెట్ కెప్టెన్ రోహిత్ శర్మనే అని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువరాజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. విరాట్, ధోనీ, రోహిత్ శర్మలలో ఎవరిని అత్యుత్తమ కెప్టెన్‌గా భావిస్తారని ఎదురైన ప్రశ్నకు యువీ ఈ విధంగా స్పందించాడు. టి20 ఫార్మాట్‌కు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి వస్తే తాను రోహిత్ శర్మను ఎంచుకుంటానని వివరించాడు. టి20 ఫార్మాట్‌లో రోహిత్‌ను మించిన సారథి లేడన్నాడు. రోహిత్ అత్యుత్తమ సారథి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో అతనికి ఎవరూ సాటిరాలేరన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News