Wednesday, October 9, 2024

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ్‌బెంగాల్‌లో ఖరగ్‌పూర్‌ జీఆర్‌పీ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేశారట. వారి నుంచి వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ ఘటనపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్‌ వెల్లడించారు. భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా గుర్తించామని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News