Wednesday, October 9, 2024

సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ తగలబెట్టారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన క్రేజీ మూవీ దేవర రిలీజ్ సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే, ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల సెలబ్రేషన్స్ లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులు క్రాకర్స్ కలుస్తూ హంగామా చేశారు. దీంతో ఎన్టీఆర్ భారీ కటౌట్  మంటల్లో తగలబడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈరోజు విడుదలైన దేవర మూవీకి పాజిటీవ్ టాక్ వస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టామంటూ అభిమానులు రచ్చ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News