Saturday, September 30, 2023

హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుపై ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు గతం గుర్తించుకోవాలని, హరీష్ రావు తన నియోజక వర్గాన్ని వదిలేసి తమ జిల్లాలో ఎందుకు పెత్తనం చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారిని మైనంపల్లి హన్మంతరావు దర్శించుకున్నారు. బిఆర్‌ఎస్ టికెట్ల గురించి మైనంపల్లి తిరుమలలో మాట్లాడారు. హరీష్ అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు. తన కుమారుడిని మెదక్ ఎంఎల్‌ఎ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మైనంపల్లి హనుమంత రావు తెలిపారు. మెదక్, మల్కాజ్‌గిరి టిక్కెట్లు ఇస్తేనే బిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తామని, ఇద్దరికి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తామని బిఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశారని, దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు సొంత డబ్బు ఖర్చు చేశారని మైనంపల్లి గుర్తు చేశారు.

Also Read: ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News