Saturday, April 27, 2024

ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ముత్తాత ఒక హిందూ బ్రాహ్మణుడు అని పేర్కొంటూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఒక పోస్టుపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఫరూఖ్ అబ్దుల్లా(జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి), అసదుద్దీన్ ఒవైసీ, జిన్నా ముత్తాలు హిందువులంటూ ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్)లో ఆదివారం ఒక యూజర్ పోస్టు ట్వీట్ చేశారు.

ఫరూఖ్ అబ్దుల్లా ముత్తాత: బల్మకుండ్ కౌల్, ఒక హిందూ బ్రాహ్మణుడు
అసదుద్దీన్ ఒవైసీ ముత్తాత: తులసీరాందాస్ ఒక హిందూ బ్రాహ్మణుడు
జిన్నా తండ్రి: జిన్నాభాయ్ ఖోజా ఒక హిందూ ఖోజా కులస్తుడు
వీరంతా ఇప్పటి ముస్లింలకు ప్రతినిధులని, వీరంతా హిందూద్వేషులని ఆ యూజర్ ఆరోపించారు.

ఈ ట్వీట్‌కు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సంఘీలు ఒక కొత్త వాదనను సృష్టించడానికి తన పూర్వీకులు బ్రాహ్మణులని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తామంతా ఆదమ్, హవా(తొలి ముస్లిం జంట) పిల్లలమని, ముస్లింలకు సమాన హక్కులు, పౌరసత్వం కోసం సాగిస్తున్న ప్రజాస్వామిక పోరాటం ఆధునిక భారత ఆత్మను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ఇది హిందూ ద్వేషం కాదని కూడా ఒవైసీ తెలిపారు.

ఇటీవల జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డిపిఎపి అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ చేసిన ఒక ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ దేశంలోని ముస్లింలలో అత్యధిక శాతం మంది ఒకప్పడు హిందువులేనని, వారంతా హిందూత్వం నుంచి ఇస్లాంలోకి మతమార్పిడి అయ్యారంటూ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. 600 సంవత్సరాల క్రితం కశ్మీరులో ఉన్నవారంతా కశ్మీరీ పండిట్లేనని, తర్వాత కాలంలో వారంతా ఇస్లాంలోకి మారారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను బిజెపి, విహెచ్‌పి నాయకులు సైతం స్వాగతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News