Saturday, April 27, 2024

పరిఢవిల్లిన మతసామరస్యం.. ఆ సిక్కు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

- Advertisement -
- Advertisement -

పరిఢవిల్లిన మతసామరస్యం: నమాజ్ చేస్తున్న ముస్లింవ్యక్తికి గొడుగు పట్టిన సిక్కు!

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం. అనేక మతాలవారు కలసిమెలిసి జీవించే దేశంగా ఇండియా ప్రపంచంలోనే పేరొందింది. అడపాదడపా భిన్న మతాలవారి మధ్య కలతలు చెలరేగినా, అవసరమొస్తే అంతా ఒక్క తాటిపై నిలబడతారనడానికి తాజాగా జమ్ములో జరిగిన సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

జమ్ములో మధ్యాహ్న సమయంలో నమాజ్ కు సమయమైంది. దాంతో ఐఐటి సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ముస్లిం సోదరుడు రోడ్డు పక్కనే నమాజ్ కు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో జోరు గాలితోపాటు వాన కూడా పడుతోంది. అదే సమయంలో వర్షానికి తలదాచుకునేందుకు ఓ షెల్టర్ కింద నిలబడిన సిక్కు మతస్థుడు ఈ విషయం గమనించాడు. వెంటనే వర్షంలో తడుస్తూ వచ్చి, ‘మీరు నమాజ్ కానీయండి… నేను ఉంటాను’ అంటూ గొడుగు తెరచి పట్టుకున్నాడు. తను వర్షంలో తడుస్తున్నా, సదరు ముస్లిం సోదరుడు నమాజ్ పూర్తి చేసేవరకూ అలాగే గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. నెట్ లో ఈ వీడియో వైరల్ కావడంతో భారతదేశంలో మతసామరస్యంపట్ల, గొడుగు పట్టుకున్న ముస్లింవ్యక్తిపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News