Saturday, April 13, 2024

భోజ్‌శాలలో హిందువుల ప్రార్థనలు

- Advertisement -
- Advertisement -

ధార్ : మధ్య ప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల/ కమాల్ మౌలా మసీదు సముదాయంలో మంగళవారం హిందువులు ప్రార్థనలు చేశారు. మరొక వైపు ఆ సముదాయంలో భారత పురావస్తు సర్వే సంస్థ(ఎఎస్‌ఐ) కోర్టు ఆదేశిత సర్వేను కొనసాగించింది. 2003 ఏప్రిల్ 7 నాటి ఎఎస్‌ఐ ఉత్తర్వు ప్రకారం, ప్రతి మంగళవారం భోజ్‌శాల సముదాయం లోపల పార్థనలకు హిందువులను అనుమతిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆ ప్రదేశంలో నమాజ్‌కు ముస్లింలను అనుమతిస్తున్నారు. ఎఎస్‌ఐ సర్వే ప్రారంభం కావడానికి ముందే ఉదయం సుమారు 7.15 గంటలకు హిందు భక్తులు ఆ చారిత్రక సముదాయానికి చేరుకున్నారు. భోజ్‌శాల సముదాయంలో ‘శాస్త్రీయ సర్వే’ను ఆరు వారాలలోగా నిర్వహించాలని ఎఎస్‌ఐని మధ్య ప్రదేశ్ హైకోర్టు ఈ నెల 11న ఆదేశించింది. ఎఎస్‌ఐ సర్వే ఈ వివాదానికి మెరుగైన పరిష్కారం తీసుకువస్తుందని భోజ్ ఉత్సవ్‌సమితి ఉపాధ్యక్షుడు బాల్‌వీర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News