Saturday, April 27, 2024

నాదల్‌కు థిమ్ షాక్

- Advertisement -
- Advertisement -

Nadal

 

ఆస్ట్రేలియా ఓపెన్

సెమీస్‌లో ముగురుజా, హలెప్

మెల్‌బోర్న్: టాప్ సీడ్ రఫెల్ నాదల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే స్పెయిన్ బుల్ నాదల్ ఓటమి పాలయ్యాడు. ఆస్ట్రియా ఆశాకిరణం, ఐదో సీడ్ డొమినిక్ థిమ్ హోరహోరీ పోరులో నాదల్‌ను మట్టి కరిపించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) కూడా సెమీస్‌లో ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), మాజీ నంబర్ గార్బయిన్ ముగురుజా (స్పెయిన్)లు సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నారు.

హోరాహోరీ
క్వార్టర్ ఫైనల్ సమరంలో థిమ్ 76, 76, 46, 76తో నాదల్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు నాదల్, అటు థిమ్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో తొలి గేమ్ నుంచే హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరు చూడచక్కని షాట్లతో అలరించారు. పట్టువీడకుండా పోరాడుతూ లక్షం దిశగా అడుగులు వేశారు. ఎవరి సర్వీసులు వారు కాపాడు కోవడంలో సఫలమయ్యారు. ఈ క్రమంలో తొలి సెట్ టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. కీలక సమయంలో థిమ్ పైచేయి సాధించాడు. నాదల్‌ను ఒత్తిడికి గురి చేస్తూ సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో కూడా హోరాహోరీ తప్పలేదు. ఈసారి కూడా పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది.

ఇక్కడ కూడా నాదల్‌కు నిరాశే మిగిలింది. ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన నాదల్ వరుస తప్పిదాలు చేశాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన థిమ్ విజయం సాధించాడు. కానీ, మూడో సెట్‌లో నాదల్ పుంజుకున్నాడు. అద్భుత ఆటతో మళ్లీ పైచేయి సాధించాడు. థిమ్‌ను కంగుతినిపిస్తూ సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే కీలకమైన నాలుగో సెట్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి మళ్లీ పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకునన థిమ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో జ్వరేవ్ 16, 63, 64, 62తో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాను ఓడించాడు. తొలి సెట్‌లో ఓటమి పాలైన జ్వరేవ్ తర్వాత వరుసగా మూడింటిలో గెలిచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాడు.

హలెప్ అలవోకగా
మహిళల విభాగంలో హలెప్ అలవోక విజయంతో సెమీస్‌కు చేరింది. ఇస్టోనియా క్రీడాకారిణి అన్నెట్ కొంటావెట్‌తో జరిగిన పోరులో హలెప్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో హలెప్ 61, 61తో విజయం సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ముగురుజా చెమటోడ్చి నెగ్గింది. రష్యా క్రీడాకారిణి అనస్తాసియాతో జరిగి మ్యాచ్‌లో ముగురుజా 75, 63తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో ముగురుజాకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో ముగురుజా విజయం సాధించింది. రెండో సెట్‌లో కూడా దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Nadal defeat at the Australian Open
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News