Wednesday, December 4, 2024

నాగచైతన్య-శోభితా పెళ్లి పనులు ప్రారంభం.. హల్దీ ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని ఇంట్లోొ పెళ్లి సందడి మొదలైంది. తాజాగా హల్దీ వేడుక ఘనంగా నిర్వహించారు.

నాగచైతన్య, శోభితా జంటకు మంగళస్నానాలు చేయించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అక్కినేని అఖిల్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న తన ప్రియురాలు జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను నాగార్జున అభిమానులుతో పంచుకున్నారు. వచ్చే ఏడాదిలో అఖిల్-జైనబ్ వివాహం జరుగుతుందని నాగ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News