Sunday, December 15, 2024

వెన్నెల కిషోర్ హాస్యం, వినోదంతో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’

- Advertisement -
- Advertisement -

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ’శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ కి రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఒక పోలీసు అధికారి తనకి క్రిడెట్ వచ్చేలా ఓ క్రిమినల్ కేసును ఛేదించడానికి ఒక తెలివైన డిటెక్టివ్‌ని సాయం కోరుతూ ఆ పనిని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌కి అప్పగిస్తాడు.

వెన్నెల కిషోర్ లీడ్ రోల్‌లో హాస్యం, వినోదంతో అలరించాడు. అతను తన పాత్రలో ఒదిగిపోయాడు. రైటర్ మోహన్ ఎంగేజింగ్ కథను రూపొందించారు,అతని డైరెక్షన్ కట్టిపడేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ “డిసెంబర్ 25న ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఉంది”అని తెలిపారు. డైరెక్టర్ రైటర్ మోహన్ మాట్లాడుతూ ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చాలా అద్భుతంగా నటించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు యదు వంశీ, నిర్మాత వంశీ నందిపాటి, యాక్టర్ రవితేజ మహాదాస్యం, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News