Monday, December 2, 2024

పిసిసి చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా..?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ పదవికి నానా పటోలే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. నానా పటోలే తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన రాజీనామాను అదిష్టానం ఆమోదించనట్లు సమాచారం. మరోవైపు, నానా పటోలే జీనామా చేసినట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎన్‌పిసిసి) ఖండించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవమని, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఎంపీసీసీ పేర్కొన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News