Friday, September 13, 2024

సెబీ నిజం తేల్చకపోతే దేశవ్యాప్త ఆందోళన

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: సెబీ ఛైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ సంచలనాత్మక ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ తన దాడిని విస్తృతం చేసింది. అదానీకి, సెబీ ఛైర్‌పర్సన్‌కు లింక్‌లు ఉన్నాయనే విషయంపై ప్రధాని మోడీ ప్రభుత్వ మౌనాన్ని తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో వెంటనే జెపిసి దర్యాప్తు అవసరం.

లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి దిగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ హెచ్చరించారు. కేరళకు చెందిన ఈ కాంగ్రెస్ ఎంపి తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. అత్యంత ప్రధానమైన ఆర్థిక వ్యవహారాల అంశంపై ప్రధాని మౌనం వ్యవస్థ పట్ల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని కెసి స్పందించారు. సెబీ విషయం పక్కదారి పట్టించేందుకు మోడీ ప్రభుత్వం అడ్డదారులకుదిగుతోంది.

రాహుల్ గాంధీపై ఇడిని కేసులకు పురమాయిస్తోందని విమర్శించారు. పార్లమెంటరీ కమిటీ ద్వారా నిజాలను వెలుగులోకి తీసుకురావడం ప్రధాని కనీస బాధ్యత అని వేణుగోపాల్ చెప్పారు. ఇడి నోటీసులతో కేంద్రం రాహుల్‌ను బెదిరించాలనుకొంటోందని, బెదిరిస్తే బెదిరే రకం కామని తెలిపారు. దారిమళ్లించే తంతు రాజకీయాలను తాము గట్టిగా ప్రతిఘటిస్తామని చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదికలోని నిజానిజాలు తేల్చకపోతే దేశవ్యాప్త ఆందోళన తప్పదని అలప్పుజా ఎంపి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News