Monday, April 29, 2024

ఉద్యోగాల పేరిట వంచన… 20 మందిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వంచించి 20 మంది మహిళలపై ఇద్దరువ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు సిరోలికి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్శన్ మహేంద్రా మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరి అని బయటపడింది. అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది మహిళలను వీరు నమ్మించారు.

వారికి ఆశ్రయం కల్పించారు.మత్తమందు కలిపిన ఆహారం అందించి స్పృహలో లేని 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి విషయం బయటచెప్పకూడదంటూ తమను బెదిరించేవారని బాధితులు ఆవేదన వెలిబుచ్చారు. అంతటితో ఆగకుండా వారి వద్ద నుంచి కొన్ని లక్షలు డిమాండ్ చేశారని బాధితులు పేర్కొన్నారు.

నిందితుల ఆగడాలను ఎదిరించిన ఓ బాధితురాలు పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కానీ నిందితులపై పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఇవన్నీ ఆరోపణలేనని పోలీస్‌లు కొట్టి పారేస్తున్నట్టు బాధితులు తెలిపారు. చివరకు బాధితులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించగా, నిందితులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీస్‌లను ఆదేశించడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News