Thursday, March 28, 2024

కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 7వేల కేంద్రాలు..
దీపావళి నుంచి ప్రారంభం

నిధుల సర్దుబాటుకు
ప్రభుత్వం సుముఖం
64.54లక్షల ఎకరాల్లో
వరి సాగు విస్తీర్ణం
కోటి 40లక్షల టన్నుల
ధాన్యం దిగుబడి అంచనా
నేడు విధివిధానాల ఖరారు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానకాలం కింద సాగు చేసిన వరికోతలు ప్రారంభమవుతున్నాయి. రైతులకు మద్దుత ధర అందించటమే లక్షంగా కేసిఆర్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధమవుతోంది. రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే నిధులు జమచేసేందుకు ప్రభుత్వం కా ర్యాచరణ ప్రణాళిక సిద్ధ్దం చేస్తోంది. ఇందుకోసం వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సుమారు రూ.25వేల కోట్లు సమకూర్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రైతులు రికార్డు స్థాయిలో పంటలు సాగు చేశారు. రాష్ట్రమంతటా ఈ వానాకాల సీజన్‌లో కోటి 23లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాల సీజన్‌లో రైతులు 64,54,567ఎకరాల్లో వరిసాగు చేశారు. గత వానాకాలంతో పోలిస్తే 2.5లక్షల ఎకరాల్లో ఈసారి అధికంగా వరి సాగులోకి వచ్చింది.

పలు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పంటకోతలు ప్రారంభమయ్యాయి. ముందుగా వరి నాట్లు వేసిన రై తులు పంటకోతల పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఈ సారి కోటి40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని ప్ర భుత్వం అంచనా వేసింది. ఇందులో తిండి కింద రై తు కుటుంబాల ధాన్యాల అవసరాలు, ప్రైవేటు వ్యా పారుల కొనుగోళ్లు , రైస్ మిల్లర్ల కొనుగోళ్లు కలసి సుమారు 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మినహాయిస్తే మిగిలిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకా శం ఉంది. ఆ మేరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.

పెరగనున్న కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, పంట దిగుబడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రక్రియలో అత్యంత కీలకం ధాన్యం కొనుగోలు కేంద్రాలే కావడంతో పౌర సరఫరాల శాఖ వాటిపై దృష్టి పె ట్టింది. దీపావళి నుంచి రైతులు ధాన్యం విక్రయాలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు ఏర్పాట్లకు సిద్ధమవుంతోంది. వానాకాలం కంటే ఈ సీజన్‌లో వరిసాగు, ధాన్యం దిగుబడి అధికం కావడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతటా 7వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో ఉంది. గత వానాకాలం సీజన్‌లో 6545 కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ సారి వీటి సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. ధాన్యం కొనుగోళ్లకు సుమారు 20వేల కోట్ల గోనే సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు, ధాన్యలో మట్టి, తాలు గింజలను ఏరివేసే ప్యాడీ క్లీనర్లు, ధాన్యంలో తేమశాతాన్ని కొలిచే మాయిశ్చర్ మిషన్లు తదితర వాటిని సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధా న్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు చేరవేసేందుకు అవసరమైనన్ని వాహానాలు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అన్ని ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

నేడు విధివిధానలపై మంత్రి సమీక్ష

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధివిధానాలు ఖరారు చేసేందుకు రాష్ట్ర పౌర సరపఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం సంబంధిత శాఖల అధికారులతో కీలక స మావేశం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. పౌరసరఫరాలు, రవాణ, రెవెన్యూ,పోలీసు ఐకేపి తదితర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మంత్రి అధికారులతో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలను సమీక్షించనున్నారు. ధాన్యం దిగుబడి, రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరించాలి, ఎన్నికొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎప్పటి నుంచి వీనిని ప్రా రంభించాలి తదితర అంశాలపై సమీక్ష అనంతరం ధాన్యంకోనుగోళ్ల ప్రణాళికను ఖరారు చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News