Thursday, April 25, 2024

రూ.400కోట్లతో వంటనూనెల రిఫైనరీ

- Advertisement -
- Advertisement -

Cooking oil refinery unit is coming up in Telangana

వెయ్యి మందికి ఉపాధి రాష్ట్రంలో
వంటనూనెల విప్లవంలో
మరో ముందడుగు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా వంటనూనెల రిఫైనరీ యూనిట్ రానుంది. సుమారు రూ. 400 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. సంబంధించి త్వరలోనే హైదరాబాద్ సమీపంలో ఒక ఎడిబుల్ ఆయిల్ రి ఫైనరీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్, సింగపూర్‌కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఫ్రీడమ్ బ్రాండ్ క్రింద ఎడిబుల్ ఆయిల్స్‌ను తయారు చేయాలని నిర్ణయించారు. బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో ప్రగతిభవన్‌లో జెమిని ఎడిబుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి భేటీ అయ్యారు. తమ కంపెనీకి చెందిన రిఫైనరీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సముఖంగా ఉన్న ట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపా ధి అవకాశాలను లభిస్తుందన్నారు. ఇందుకు కెటిఆర్ ఎంతగానో సంతోషిస్తూ రిఫైనరీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యజమాన్యాన్ని అభినందించారు. సంస్థ నిర్ణయాన్ని స్వాగతించిన కెటిఆర్…. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంస్థకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.

కాగా రీఫైనరీ యూనిట్‌తో ఫ్రీడం అయిల్ ఇకపై తెలంగాణలోనే తయారు కావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ నుంచి ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడంలో ఈ సంస్థ ప్రధాన భూమిక పోషించనుందన్నారు. జెమిని ఎడిబుల్స్ రిఫైనరీతో రాష్ట్రంలో ఎల్లో రివల్యూషన్లో తెలంగాణ మరో కీలక అడుగు వేసినట్టు అవుతుందన్నారు. ఈ రిఫైనరీతో రాష్ట్రానికి చెందిన అయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇప్పటికే సిఎం కెసిఆర్ (2వ హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం) సారథ్యంలో నాలుగు విప్లవాలకు శ్రీకారం చుట్టిందన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. తి తెలంగాణ నుంచి ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడంలో జెమినీ ఎడిబుల్స్ కొత్త పెట్టుబడి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తద్వారా స్థానిక రైతులకు కూడా మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా ఈ కంపెనీ కొనసాగుతోందన్నారు.

అనంతరం జెమిని ఎడబుల్స్ ఎండి ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ, ప్రతిపాదిత యూనిట్ తెలంగాణలో పసుపు విప్లవానికి నాంది అని అన్నారు. త్వదారా సమీప భవిష్యత్తులో అనేక యూనిట్లు వచ్చే అవకాశముందన్నారు. ఈ యూనిట్ 1,000 మందికి పైగా స్థానికులకు ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్రంలోని అనేక నూనె గింజల రైతులకు కూడా మద్దతు లభిస్తుందన్నారు. రోజుకు వెయ్యి టన్నుల సామర్థ్యం గల ఉత్పత్తిని ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ల్యాండ్ లాక్డ్ స్టేట్‌లో వస్తున్న ఈ రకమైన ప్లాంట్ ఇదే మొదటిదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News