Sunday, April 28, 2024

కేంద్ర కార్యక్రమాల సద్వినియోగం అవసరం : నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రితో రాష్ట్రానికి చెందిన ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్,జి మనోహర్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అర గంటసేపు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, ప్రభుత్వం అనుసరిస్తు తప్పుడు ఆర్థిక విధానాలపై,ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం పూర్తిగా మద్యం అమ్మకాలపై, భూముల అమ్మకాల మీదనే ఆధారపడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకొని వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయక పోవడంతో విద్య ,వైద్య ,ఉపాధి, రంగంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.

స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్నటువంటి నిధుల్ని పూర్తిగా కూడా పక్క దారి పట్టాయని . పంచాయతీల జీతభత్యం , విద్యుత్తు బిల్లుల, ట్రాక్టర్ల చెల్లింపుల కోసం మళ్లిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్న విషయాన్ని ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆవాస్ యోజన, సడక్ యోజన,స్మార్ట్ సిటీ పనులు నిధులు కూడా అలాగే జరుగుతున్నాయని తెలియజేశారు. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రం ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటాను లబ్ధిదారులకు తెలియజేస్తూ రసీదులు ఇస్తున్నదో అలాగే ప్రతి ప్రతి పనిలో కూడా జరిగేటట్టు చూడాలని బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిని కోరారు.

ఎఫ్‌ఆర్‌బిఎం పెంచుకుంటూ పోతే మరింత దివాలా కోరు పరిస్థితి దాపరించే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖజానా ఖాళీ అవ్వడంతో. మద్యం అమ్మ కాలనీ కూడా ముందస్తుగా అప్లికేషన్స్, టెండర్లు తీసుకొచ్చి నిధులు సమకూర్చుకోవటం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో స్థిరాస్తులు తగ్గిపోతున్నాయని.. తెలంగాణ ప్రజలకు,ఉద్యోగులకు, విద్యార్థులకు ఇది అర్థమైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టడం కోసం ఆర్థికపరమైన సమీక్షని నిర్వహించాలని కేంద్రమంత్రిని వారు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ శాఖలా పరమైన సమీక్షలు ఇప్పటికే ప్రారంభమైనాయని ఇవి కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి వారికి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News