Wednesday, May 1, 2024

పిల్లల చాక్లెట్లలో మత్తుమందు.. కర్నాటకలో గ్యాంగ్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో రుచిరకరమైన మళ్లీ మళ్లీ పిల్లలు తినేలా చేసే చాకెట్ల రాకెట్ వెలుగులోకి వచ్చింది. మత్తుమందు మరిజౌనాను ఈ చాకెట్లలో పెట్టి పిల్లలకు స్కూళ్ల వద్ద, ఇతర చోట్ల అమ్ముతున్న వారిని వలపన్ని పట్టుకున్నారు. ఈ చాకెట్లు తిన్న పిల్లలు మరీమరీ ఇవే కావాలనడం , ఈ 20 రూపాయల చాకెట్లు తిన్నతరువాత వింతగా వ్యవహరించడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీనితో పోలీసులకు విషయం తెలిపారు. దీనితో కర్నాటకలోని మంగళూరులో ఈ చాకెట్ల ముఠా దొరికింది.

స్థానిక పోలీసులు రెండు షాప్‌లపై దాడి చేయగా మత్తుమందు దట్టించి ఉన్న 120 కిలోల ప్రమాదకరమైన చాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల యజమానులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా ఇటువంటి చాకెట్లకు ఒక్కసారి పిల్లలు అలవాటుపడితే, వారు వీటికి బానిసలవుతారని పిల్లల డాక్టరు డాక్టర్ ఎస్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. పిల్లలు తమ నోటికి ఏదైతే నచ్చుతుందో అవేతింటారని, ఈ బలహీనతనే ఇటువంటి చాక్లెట్ట విక్రయాల ద్వారా కొందరు వాడుకుంటున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News