Saturday, December 14, 2024

త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మిర్యాలగూడ: త్వరలోనే రాష్ట్ర నూతన ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఆదివారం నీటి పౌర శా ఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి యూనిట్ సింక్రనైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సిఎం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ నిష్ణాతులు, మేధావు లు అన్నివర్గాల ప్రజలందరి అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత నూతన ఎన ర్జీ పాలసీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. గ తంలో వైటిపిఎస్ యూనిట్ 2 సింక్రనైజేషన్ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించిన విషయం తెలిసిందేనన్నారు. 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా పూర్తిస్థాయిలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చే స్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పవర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉత్సాదనను చే పడుతున్నామని అన్నారు. 202829 నాటికి రా ష్ట్రవ్యాప్తంగా 22,488 మెగావాట్ల విద్యుత్ డి మాండ్ ఉండవచ్చునని అంచనాలు రూపొందించామని, ఇది 20342035 నాటికి 31,809 మె గావాట్ల డిమాండ్‌కు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. పరిశ్రమలు, ఇతర అవసరాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏ రంగంలో విద్యుత్ సమస్య రాకుండా పూర్తిస్థాయి లో విద్యుత్ అందించే విధంగా ప్రణాళికలతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు, ఇ తర అవసరాలకు విద్యుత్ లేదని అనిపించుకోకుండా అన్ని అవసరాలు తీర్చేలా పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పాదన చేపట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుతామని తెలిపారు.

ఇందులో భాగంగా ఇంధన వనరుల ద్వా రా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గు అందించే ర్యాకుల రైల్వే వ్యాగన్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, వైటిపిఎస్ చైర్మన్ సందీప్‌కుమార్ సుల్తానియా క లెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్‌పి శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ శాసనసభ్యులు బత్తుల లకా్ష్మరెడ్డి, వైటీఎస్ టెక్నిక ల్ డైరెక్టర్ అజయ్, ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానంద, చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News