Saturday, December 14, 2024

రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : వరంగల్ మ హా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించా రు. నగర మేయర్ గుండు సుధారాణి, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రా జేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పి. ప్రావీణ్యతో కలిసి వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు, భద్రకాళి చెరువు బొంది వాగు వరద నివారణ పనులు, భద్రకాళి మా డవీధులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సం దర్భం గా మంత్రి మాట్లాడుతూ..భద్రకాళి చెరువు ను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించా రు. భద్రకాళి చెరువు బొంది వాగు వరద నివారణకు ప్రభుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసిందని, బొం ది వాగు నాలా, భద్రకాళి నాలా, భద్రకా ళి క్యాచ్‌మెంట్ ఏరియాలలో చేపట్టే వరద నివారణ కు సంబంధించిన అభివృద్ధి పనుల మ్యాప్‌ను పరిశీలించారు. ఆయా వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడు తూ.. క్రీస్తుపూర్వం 600 ఏళ్ల
క్రింద నిర్మించిన భద్రకాళి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి కరీంనగర్,ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుండి భక్తులు వస్తారని, ఈ ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి రెండవ రాజధానిగా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వరంగల్ సమగ్రాభివృద్ధి చర్యల్లో భాగంగా భక్తుల అభిరుచికి అనుగుణంగా భద్రకాళి ఆలయం, మాడవీధులను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆలయాన్ని అనుకుని ఉన్న చెరువును అభివృద్ధి చేయడానికి పరిశీలించామని అన్నారు. సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూడిక పేరుకుపోయి, చెరువు లోతు తగ్గి, సమాంతరంగా మారడం కారణంగా నీరు నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, వెంటనే చెరువు పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన వెంటనే వరంగల్ ప్రాంతవాసులకు ఎయిర్‌పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో పాటు రాబోయే 30 సంవత్సరాల వరకు నగర ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు, అండర్ డ్రైనేజీ, ఎలక్ట్రిఫికేషన్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలను తయారు చేశామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు కళా క్షేత్రాన్ని, పట్టణానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, కుడా పిఓ అజిత్ రెడ్డి, జిడబ్ల్యుఎంసి ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు భీంరావు, సంతోష్ బాబు, సీతారాం, ఇరిగేషన్, కూడా, జిడబ్ల్యూఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News