Saturday, December 14, 2024

యాదాద్రికి కార్తీక శోభ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో వచ్చిన తొలి ఆదివారం కావడంతో స్వామివారి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు తరలివచ్చారు. కొద్దిరోజులుగా ఆలయంలో భక్తు ల రద్దీ సాధారణంగా ఉండగా ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్ల శీఘ్ర దర్శనం 4 గంటలు, అతిశీఘ్రదర్శనం 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రూ.60,82,772 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,86, 400, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 5,68,000, విఐపి దర్శనం ద్వారా రూ.8,83,650, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.6,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,00,064, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 20,07,120, కల్యాణకట్ట ద్వారా రూ.1,25, 000తో పాటు వివిధ శాఖ, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News