Tuesday, April 30, 2024

మహిళల ఖాతాల్లోకి రూ. లక్ష

- Advertisement -
- Advertisement -

కొత్త ప్రభుత్వం రాగానే ఏటా ఆ నగదు బదలీ
వచ్చేది మా ప్రభుత్వమే
రాహుల్ గాంధీ ధీమా

శివ్‌ని (మధ్య ప్రదేశ్) : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని సోమవారం ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను కొత్త ప్రభుత్వం బడలీ చేస్తుందని రాహుల్ ప్రకటించారు. మాండ్లా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని శివ్‌ని జిల్లా ధనోరాలో ఒక ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ నిరుద్యోగ యువజనులకు గ్యారంటీగా అప్రెంటిస్‌షిప్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి కేటగరీలు, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి లక్ష రూపాయల బదలీ వంటి మూడు నాలుగు విప్లవాత్మక చర్యల గురించి మా మేనిఫెస్టో ప్రస్తావించింది.

ఈ విధంగా ప్రతి నెల వారి ఖాతాల్లోకి వేలాది రూపాయలను మేము బదలీ చేయనున్నాం’ అని ఆయన తెలియజేశారు. మాండ్లా నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపి, కేంద్ర మంత్రి ఫగ్గన్ కులస్థేకు పోటీగా మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ ఓంకార్ సింగ్ మార్కమ్‌ను కాంగ్రెస్ నిలబెట్టింది. ఆశా, అంగన్‌వాడీ కార్మికులకు చెల్లిస్తున్న మొత్లాన్ని రెట్టింపు చేస్తామని కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లు రాహుల్ తెలిపారు. దేశంలోని నిరుద్యోగ యువజనులు‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ పొందేలా చూసేందుకు మేము కొత్త చట్టం కూడా తీసుకువస్తాం.

ఆ కాలంల వారు భత్యంగా లక్ష రూపాయలు కూడా పొందగలరు’ అనికాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చెప్పారు. అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన తరువాత వారి ప్రదర్శన బాగున్నట్లయితే అదే ప్రదేశంలో ఉద్యోగం పొందగలరని ఆయన సూచించారు. ‘కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మేము ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిని అంతం చేస్తాం. ప్రభుత్వ రంగంలో 30 లక్షల ఖాళీలు భర్తీ చేస్తాం’ అని రాహుల్ తెలిపారు. రైతులు తమ పంటలకు తగినంత ఎంఎస్‌పి పొందేలా చూసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం చేస్తుందని ఆయన చెప్పారు. రైతులు ఎంఎస్‌పి కోసం సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. బిజెపి గిరిజనులను ‘ఆదివాసీలు’గా పిలవడానికి బదులు ‘వనవాసీలు’గా ఉద్దేశపూర్వకంగా పేర్కొంటున్నదని, వారి భూముల నుంచి వారిని తొలగించడం, నీరు, అడవి, భూమిపై వారి తొలి హక్కును కైవసం చేసుకోవడం ఆ పార్టీ ధ్యేయమని ఆయన ఆరోపించారు. వారి (గిరిజనుల) భూములను పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని ఆ పార్టీ కోరుకుంటున్నదని రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News