Thursday, May 2, 2024

ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మోడీ ‘ముస్లిం లీగ్’ వ్యాఖ్యకు పార్టీ ఆక్షేపణ
కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చిన మోడీ
6న అజ్మీర్ ర్యాలీలో ఆ వ్యాఖ్య చేసిన మోడీ
కాంగ్రెస్ మేనిఫెస్టో ‘అబద్ధాల పుట్ట’ అని విమర్శ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉందని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ (ఇసి)కి ఫిర్యాదు చేసింది. శనివారం (6న) రాజస్థాన్ అజ్మీర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ఆ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘అబద్ధాల పుట్ట’ అని అభివర్ణించిన మోడీ ఆ డాక్యుమెంట్‌లో ప్రతి పేజీ ‘భారత్‌ను ముక్కలు చేసే యత్నం’గా కనిపించిందని ఆరోపించారు. ముస్లిం లీగ్ ముద్ర ఉన్న ఆ మేనిఫెస్టో తరువాయి భాగాన్ని లెఫ్టిస్టులు తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు సిద్ధాంతాలు గానీ, విధానాలు గానీ లేవు.

కాంగ్రెస్ ప్రతిదీ కాంట్రాక్ట్ ఇచ్చిందని, మొత్తం పార్టీ ఔట్‌సోర్స్ చేసినట్లు ఉందని కనిపిస్తోంది’ అని మోడీ అన్నారు. ప్రధాని వ్యాఖ్యకు కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్ల లక్షాన్ని దాటేందుకు బిజెపి తంటాలు పడే అవకాశం ఉండడంతో ఆయన భయపడినట్లున్నారని, ‘అదే హిందు, ముస్లిం స్క్రిప్ట్’ వాదనకు దిగారని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బిజెపిపై విమర్శలకు దిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి, ముస్లిం లీగ్‌కు వారి ‘సైద్ధాంతిక పూర్వీకులు’ మద్దతు ఇచ్చారని ఖర్గే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News