Tuesday, June 18, 2024

షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా 44 మంది గాయపడ్డారని, దట్టమైన పొగకు ఊపిరి ఆడక వీరంతా మరణించి ఉంటారని పోలీసులను ఉటంకిస్తూ ఖలీజ్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. గాయపడిన 44 మందిలో 17 మంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మంది దిశ్చార్జ్ అయ్యారని షార్జా పోలీసులు తెలిపారు.

మరణించిన ఇద్దరు భారతీయులలో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్(డిబ్లుటిసి)లోని డిఎక్స్‌బి లైవ్ థియేటర్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మైఖేల్ సత్యదాస్ ఉన్నారు. ఎఆర్ రహ్మాన్, బ్రూనో మార్స్ వంటి ప్రముఖుల కాన్సర్ట్‌కు సత్యదాస్ సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. మృతులలో ముంబైకు చెందిన 29 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఆమెకు ఫిబ్రవరిలో మదీనాలో వివాహమైంది. అగ్నిప్రమాదంలో ఆమె భర్త కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News